హైదరాబాద్: గన్‌పార్క్ వద్ద బీజేపీ మహిళా మోర్చా నిరసన
ABN , First Publish Date - 2020-08-20T18:48:07+05:30 IST
గవర్నర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో గన్‌పార్క్ వద్ద నిరసన చేపట్టారు.

హైదరాబాద్: గవర్నర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో గన్‌పార్క్ వద్ద నిరసన చేపట్టారు. గవర్నర్ తమిళసైకి సీఎం కేసీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రథమ పౌరురాలిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే సైదిరెడ్డిని సస్పెండ్ చేయాలన్నారు. సోషల్ మీడియాలో కేసీఆర్ దండు పేరుతో గవర్నర్‌పై ట్రోలింగ్‌ను డీజీపీ అడ్డకోవాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌కు ఒక పార్టీని అంటకట్టడం నీచమైన చర్య అని గీతా మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.