హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసం
ABN , First Publish Date - 2020-10-14T16:27:37+05:30 IST
హైదరాబాద్‌లో భారీ వర్షాలకు అంతా అతలాకుతలమవుతోంది.

హైదరాబాద్: నగరంలో భారీ వర్షాలకు అంతా అతలాకుతలమవుతోంది. శంషాబాద్ గగన్‌పహాడ్ వద్ద అప్పచెరువు తెగిపోవడంతో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. ఈ సమయంలో అక్కడ ప్రయాణిస్తున్న పలు కార్లు కూడా ధ్వంసమైనట్లు తెలియవచ్చింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందినట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రజలంతా అధికారులకు సహకరించాలని, అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల నుంచి ఎవరూ బయటకురావద్దని సీపీ సజ్జనార్ అన్నారు. ఎయిర్ పోర్టుకు, కర్నూలు వైపు వెళ్లేవారు ఓఆర్ఆర్ ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.