హైదరాబాద్ బాలానగర్‌ రోడ్డుపై షాకింగ్ ఘటన

ABN , First Publish Date - 2020-12-26T00:40:04+05:30 IST

రోడ్డెక్కితే ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. చిన్న పిల్లలతో వెళ్లే వాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు తప్పకపోవచ్చు. హైదరాబాద్ బాలానగర్‌లో..

హైదరాబాద్ బాలానగర్‌ రోడ్డుపై షాకింగ్ ఘటన

హైదరాబాద్: రోడ్డెక్కితే ఎవరైనా జాగ్రత్తగా ఉండాల్సిందే. చిన్న పిల్లలతో వెళ్లే వాళ్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. లేదంటే ప్రమాదాలు తప్పకపోవచ్చు. హైదరాబాద్ బాలానగర్‌లో జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. బీబీఆర్ హాస్పిటల్ సమీపంలో ఓ తల్లి తన కొడుకుతో కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తోంది. అంతలోనే ఓ బాలుడు తల్లి చేయి వదిలి రోడ్డు మీదకు పరిగెత్తాడు. ఓ బైక్ కింద పడిపోయాడు. ఇది చూసిన వాహనదారుడు ఉలిక్కిపడ్డాడు. భయంతో కిందపడిపోయాడు. ప్రమాద దృశ్యాన్ని చూసిన వాళ్లంతా ఒక్కసారిగా బాలుడు వద్దకు పరిగెత్తారు. ఆ పిల్లవాడికి ధైర్యం చెప్పారు. గాయాలేమీ కాలేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2020-12-26T00:40:04+05:30 IST