నేటి నుంచి నిరసన: ట్రస్మా

ABN , First Publish Date - 2020-12-15T12:48:38+05:30 IST

నేటి నుంచి నిరసన: ట్రస్మా

నేటి నుంచి నిరసన: ట్రస్మా

ముషీరాబాద్‌,  (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ బడ్జెట్‌ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎస్‌.ఎన్‌.రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 15న మండలాల వారీగా ఎంఈవో, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్లను కలిసి వినతిపత్రం అందజే యనున్నట్టు చెప్పారు. 16న ప్రధాన కూడళ్లలో ప్లకార్డులతో మౌన ప్రదర్శన, 17న జిల్లా విద్యాశాఖ అధికారులను కలిసి వినతిపత్రం అందజేసి నిరాహార దీక్షలు చేపడతామని తెలిపారు. 18న డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ అధికారిని కలిసి వినతిపత్రం అందజేసి ఒక రోజు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు చెప్పారు. బడ్జెట్‌ పాఠశాల ఉపాధ్యాయులకు రూ.10 వేల గురుదక్షిణ ఇవ్వాలని, 2021- 2022 సంవత్సరానికి పాఠశాల గుర్తింపు పొడిగించాలనేవి తమ డిమాండ్లని ఆయన వివరించారు.

Updated Date - 2020-12-15T12:48:38+05:30 IST