హైదరాబాద్‌లో పేకాటాడుతూ పట్టుబడ్డ ప్రముఖులు
ABN , First Publish Date - 2020-10-31T13:24:45+05:30 IST
నగరంలోని జూబ్లీహిల్స్‌లో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు.

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్‌లో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈక్రమంలో 11 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పేకాట ఆడుతూ పట్టుబడ్డ ప్రముఖుల వివరాలపై పోలీసులు గోప్యత పాటిస్తున్నట్లు తెలుస్తోంది.