జూబ్లీహిల్స్ అపోలో వద్ద ఘర్షణ
ABN , First Publish Date - 2020-10-29T02:01:07+05:30 IST
జూబ్లీహిల్స్ అపోలో వద్ద ఘర్షణ

హైదరాబాద్: జూబ్లీహిల్స్ అపోలో వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఘర్షణ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని స్థానికులు పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే.. సందీప్‌కుమార్‌రెడ్డి అనే వ్యక్తిని రిటైర్డ్ ఉద్యోగి లోకందర్‌రెడ్డి దతత్త తీసుకున్నారు. అయితే ఇటీవలే బ్లడ్ క్యాన్సర్‌తో సందీప్‌కుమార్‌రెడ్డి మృతి చెందారు. ఆస్తి కోసం లోకేందర్‌రెడ్డి భార్యను బంధించి సందీప్ భార్య లత దాడికి పాల్పడ్డారు. సందీప్‌రెడ్డి భార్య లత వృద్ధురాలిని ఇంటి నుంచి గెంటేసింది. లోకందర్‌రెడ్డి బంధువులపై లత బంధువులు దాడికి పాల్పడ్డారు. ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి దాడికి పాల్పడ్డారని లోకందర్‌రెడ్డి ఆరోపించారు.