తారాస్థాయికి కంటోన్మెంట్ బోర్డు సభ్యుల విభేదాలు

ABN , First Publish Date - 2020-09-20T19:27:15+05:30 IST

కంటోన్మెంట్ బోర్డు సభ్యుల విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

తారాస్థాయికి కంటోన్మెంట్ బోర్డు సభ్యుల విభేదాలు

హైదారాబాద్: కంటోన్మెంట్ బోర్డు సభ్యుల విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు రామకృష్ణ టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామాకు బోర్డు సభ్యులతో విభేదాలే కారణమని రామకృష్ణ తెలిపారు. బోర్డు ఉపాధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేయాలని సభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. రాజీనామా పత్రాన్ని మంత్రి కేటీఆర్‌కు రామకృష్ణ పంపించారు. 

Updated Date - 2020-09-20T19:27:15+05:30 IST