హైదరాబాద్‌లో తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరం ఆందోళన

ABN , First Publish Date - 2020-09-05T17:11:35+05:30 IST

ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ప్రభుత్వ వైఖరికి నిరసనగా డీఈఓ కార్యాలయం ముందు తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరం ఆందోళనకు దిగింది.

హైదరాబాద్‌లో తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరం ఆందోళన

హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, ప్రభుత్వ వైఖరికి నిరసనగా డీఈఓ కార్యాలయం ముందు తెలంగాణ ప్రైవేటు టీచర్స్ ఫోరం ఆందోళనకు దిగింది. సెప్టెంబర్ 5(టీచర్స్ డే)ను బ్లాక్‌డేగా ప్రైవేటు ఉపాధ్యాయులు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా హైదరాబాద్ డీఈఓ కార్యాలయం ముందు నల్లజెండాలు, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనకు దిగారు. ప్రైవేట్ టీచర్లకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 45 ప్రకారం ప్రైవేటు టీచర్లకు, నాన్-టీచింగ్ సిబ్బందికి యాజమాన్యాలు పూర్తి వేతనం చెల్లించాలని ఉపాధ్యాయులు పట్టుబట్టారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని.... ప్రైవేటు విద్యా సంస్థలను నియంత్రించడానికి ప్రభుత్వం ఒక రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని.. ప్రభుత్వ ప్రైవేటు ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇచ్చి సత్కరించాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం డిమాండ్ చేస్తోంది. 


Updated Date - 2020-09-05T17:11:35+05:30 IST