బక్రీద్‌కు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-08-01T12:38:29+05:30 IST

బక్రీద్‌కు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు

బక్రీద్‌కు జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు

జంతు వ్యర్థాల తొలగింపునకు అదనపు వాహనాలు.. ప్లాస్టిక్‌ కవర్లు


హైదరాబాద్: బక్రీద్‌ పండగకు జీహెచ్‌ఎంసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. జంతు వ్యర్థాల తొలగింపునకు అదనపు వాహనాలు సమకూర్చినట్టు కమిషనర్‌ డీఎస్‌ లోకేష్‌కుమార్‌ తెలిపారు. వ్యర్థాలు వేసేందుకు పలు సర్కిళ్లలో 4.11 లక్షల నల్లటి ప్లాస్టిక్‌ కవర్లు ఇచ్చారు. ఆ కవర్లలో వేసిన వ్యర్థాలను తరలించేందుకు వేర్వేరు సామర్థ్యాలతో కూడిన 360 వాహనాలు అందుబాటులో ఉంచారు. 25, 10, 6 టన్నుల వాహనాలతోపాటు మినీ టిప్పర్లు, వ్యర్థాలు వాహనాల్లో వేసేందుకు 103 ప్రొక్లెయినర్లు, మూడు బాబ్‌కాట్‌లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఎప్పటికప్పుడు వ్యర్థాలు తొలగించేందుకు ఏర్పాట్లు చేశామని, ప్రజలు సహకరించాలని కమిషనర్‌  కోరారు.

Updated Date - 2020-08-01T12:38:29+05:30 IST