భార్యను కించపరిచారని.. భర్త ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-03-13T15:09:37+05:30 IST

భార్యను కించపరిచారని మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. సింగరేణి కాలనీ, పిట్టలబస్తీలో నివసిస్తున్న శ్రీనివాస్‌ (35)ఎలక్ట్రీషియన్‌. సెంట్రింగ్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి ఇంటి సమీపంలో అన్న

భార్యను కించపరిచారని.. భర్త ఆత్మహత్య

హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): భార్యను కించపరిచారని మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. సింగరేణి కాలనీ, పిట్టలబస్తీలో నివసిస్తున్న శ్రీనివాస్‌ (35)ఎలక్ట్రీషియన్‌. సెంట్రింగ్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడి ఇంటి సమీపంలో అన్న కుటుంబం నివసిస్తోంది. రెండు రోజుల క్రితం జరిగిన స్వల్ప వివాదంలో సోదరుడి భార్య శ్రీనివాస్‌ భార్యను కించపరిచే విధంగా మాట్లాడింది. వదిన మాటలకు అతడు మనస్తాపం చెందాడు. తాగిన మత్తులో బుధవారం సాయంత్రం ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. గురువారం ఉదయం భార్యతో కలిసి సైదాబాద్‌ పోలీసులకు వదినపై ఫిర్యాదు చేశారు. సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శ్రీనివాస్‌ ఆత్మహత్య చేసుకున్నాడు.

Read more