నేడు నగరానికి హ్యూమన్ రైట్స్ కమిషన్ రాక
ABN , First Publish Date - 2020-12-20T04:19:57+05:30 IST
నేడు నగరానికి హ్యూమన్ రైట్స్ కమిషన్ రాక

ఎంజీఎం, సెంట్రల్‌జైలు సందర్శన
వరంగల్ అర్బన్ క్రైం, డిసెంబర్ 19: వరంగల్ నగరంలో ఆదివారం రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్ సభ్యులు పర్యటించనున్నారని కమిషన్ సెక్రటరీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కమిషన్ చైర్మన్ ఎన్.ఆనంద్‌రావు, జస్టిస్ గుండ రామచంద్రయ్య, సభ్యుడు ఆర్ఫార్ మొయినోద్దీన్‌లు ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10.30 గంటలకు హన్మకొండ సర్య్కూట్ గెస్ట్‌హౌ్‌సకు చేరుకుంటారు. వరంగల్ అర్బన్ కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఇన్‌చార్జి సీపీ ప్రమోద్‌కుమార్, మునిసిపల్ కమిషనర్ పమేలాసత్పతి, డీఈవో నారాయణరెడ్డి, జిల్లా వైద్యాధికారులతో కలిసి ఉదయం 11.45కు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని కొవిడ్ వార్డును పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3.30గంటలకు వరంగల్ కేంద్రకారాగారంలో పర్యటించి ఖైదీల సమస్యలు అడిగి తెలుసుకుంటారని శ్రీనివాసరావు తెలిపారు.