జర్నలిస్టు మనోజ్‌ మృతిపై నివేదిక కోరిన ఎస్‌హెచ్ఆర్సీ

ABN , First Publish Date - 2020-06-22T15:05:01+05:30 IST

జర్నలిస్టు మనోజ్ మృతిపై నివేదిక ఇవ్వాలంటూ గాంధీ ఆస్పత్రి అధికారులను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ నివేదిక కోరింది. కరోనా పాజిటివ్ నేపథ్యంలో మనోజ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స

జర్నలిస్టు మనోజ్‌ మృతిపై నివేదిక కోరిన ఎస్‌హెచ్ఆర్సీ

హైదరాబాద్: జర్నలిస్టు మనోజ్ మృతిపై నివేదిక ఇవ్వాలంటూ గాంధీ ఆస్పత్రి అధికారులను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ నివేదిక కోరింది. కరోనా పాజిటివ్ నేపథ్యంలో మనోజ్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే గాంధీ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే మనోజ్ మృతి చెందాడంటూ పలువురు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. మనోజ్ మృతికి పరిహారంగా రూ. కోటి పరిహారం ఇప్పించాలని, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ మనోజ్ మృతిపై పూర్తిస్థాయి నివేదికను ఇవ్వాలని గాంధీ ఆస్పత్రి అధికారులను ఆదేశించింది.

Updated Date - 2020-06-22T15:05:01+05:30 IST