పస్తులుంటున్నం, ఆదుకోరూ..!

ABN , First Publish Date - 2020-04-24T09:53:19+05:30 IST

ఆమె నిరుపేద. భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఇద్దరు కూతుళ్ల పొట్ట నింపేందుకు కుట్టు మిషనే ఆమెకు ఆధారం.

పస్తులుంటున్నం, ఆదుకోరూ..!

100కు హుజురాబాద్‌ మహిళ ఫోన్‌.. ఆదుకున్న పోలీసులు


హుజూరాబాద్‌, ఏప్రిల్‌ 23: ఆమె నిరుపేద. భర్త వదిలేసి వెళ్లిపోయాడు. ఇద్దరు కూతుళ్ల పొట్ట నింపేందుకు కుట్టు మిషనే ఆమెకు ఆధారం. అదే వారికి ఆకలి తీరే మార్గం. కానీ.. లాక్‌డౌన్‌ ఆ కుటుంబం పాలిట శాపంగా పరిణమించింది. ఇలాం టి ఆపత్కాల సమయంలో అత్యవసర నెంబర్‌ 100 ఆమెను ఆదుకుంది. బిడ్డలతో సహా, ఆమెను ఆకలి కోరల నుంచి రక్షించింది.


కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక సూపర్‌ బజార్‌ రోడ్డులో నివాసముంటున్న కుసుమ రాధిక 100కు డయల్‌ చేసి.. తన గోడును వెళ్లబోసుకుంది. వెంటనే స్పందించిన సీఐ మాధవి, మొబైల్‌ టీంను రాధిక ఇంటికి పంపించి వివరాలు సేకరించారు. విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్‌ కేసిరెడ్డి లావణ్య, సూర్య హాస్పిటల్‌ యజమాని మారం శ్రీనివా్‌సరెడ్డి రాధికకు బియ్యం, సరుకులు అందజేసి ఆదుకున్నారు.

Updated Date - 2020-04-24T09:53:19+05:30 IST