సీఎంఆర్‌ఎఫ్‌కు భారీగా విరాళాలు

ABN , First Publish Date - 2020-10-24T08:33:22+05:30 IST

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు చేయూతగా పలువురు శుక్రవారం

సీఎంఆర్‌ఎఫ్‌కు భారీగా విరాళాలు

రూ.5 కోట్లు ఇచ్చిన దివిస్‌ లేబోరేటరీ


హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు చేయూతగా పలువురు శుక్రవారం సీఎం సహాయ నిధికి(సీఎంఆర్‌ఎఫ్‌) విరాళాలు అందించారు. మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి చెక్కులను అందజేశారు. దివీస్‌ లేబోరేటరీ రూ.5 కోట్ల విరాళాన్ని అందించగా మరికొన్ని సంస్థలు కూడా భారీగానే విరాళాలిచ్చాయి. 


దివిస్‌ లేబోరేటరీ లిమిటెడ్‌ రూ.5 కోట్లు. 

జీఎంఆర్‌-ఎయిర్‌పోర్ట్‌ సంస్థల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ప్రసన్న 2.50 కోట్లు.  

తెలంగాణ పౌల్ర్టీ బీడర్స్‌ అసోసియేషన్‌ తరఫున, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి రూ.కోటి.

తెలంగాణ పౌల్ర్టీ ఫెడరేషన్‌ తరపున అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌ కోటి.

స్నేహా పౌల్ర్టీ ఫాం ఎండీ రాంరెడ్డి రూ.కోటి.

శ్రీ చైతన్య స్టూడెంట్స్‌, ఫ్యాకల్టీ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.కోటి.

బ్లెండర్స్‌ అండ్‌ డిస్టిలరీస్‌ ఛైర్మన్‌ కిషోర్‌ బాబు రూ.కోటి

లారస్‌ ల్యాబ్స్‌ లిమిటెడ్‌ సీఈవో సత్యనారాయణ రూ.50 లక్షలు.

ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ర్టో ఎంటరాలజీ ఎండీ నాగేశ్వర్‌రెడ్డి రూ.50 లక్షలు.

రామకృష్ణ గంగపర్తి రూ. 5 లక్షలు. 

Updated Date - 2020-10-24T08:33:22+05:30 IST