ఆదుకోండి.. లేదా అడుక్కోనివ్వండి

ABN , First Publish Date - 2020-05-30T08:46:28+05:30 IST

ఆదుకోండి.. లేదా అడుక్కోనివ్వండి

ఆదుకోండి.. లేదా అడుక్కోనివ్వండి

హెచ్చార్సీలో పిటిషన్‌


హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌లో అలమటిస్తున్న వనం రాజేశ్‌ అనే దివ్యాంగుడు ఆహారం దొరక్క పస్తులుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో ‘‘ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి. లేకుంటే అడుక్కోవడానికి అనుమతి ఇవ్వాలి’’ అంటూ హెచ్చార్సీని ఆశ్రయించాడు. అనాథ అయిన అతను అమీర్‌పేటలో యాచకవృత్తి చేస్తూ జీవిస్తున్నాడు. ఒక సామాజిక కార్యకర్త సహకారంతో అతను హెచ్చార్సీలో పిటిషన్‌ వేశాడు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కమిషన్‌ హైదరాబాద్‌ కలెక్టర్‌కు నోటీసులిచ్చింది.

Updated Date - 2020-05-30T08:46:28+05:30 IST