ఒంటెల స్మగ్లింగ్‌ను ఎలా నిరోధిస్తారు?: హైకోర్టు

ABN , First Publish Date - 2020-07-18T08:22:19+05:30 IST

ఒంటెల స్మగ్లింగ్‌ను ఎలా నిరోధిస్తారు?: హైకోర్టు

ఒంటెల స్మగ్లింగ్‌ను ఎలా నిరోధిస్తారు?: హైకోర్టు

హైదరాబాద్‌, జూలై 17(ఆంధ్రజ్యోతి): ఒంటెల అక్రమ రవాణాను, వధను నిరోధించేందుకు అనుసరించే కార్యాచరణ ప్రణాళికేంటో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మాంసం కోసం ఒంటెలను హైదరాబాద్‌కు తరలించడాన్ని ప్రశ్నిస్తూ కె. శశికళ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఒంటెలను వధించకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంలో కౌంటర్‌ దాఖలు చేసిన ప్రభుత్వం... ఒంటెలను వధించడానికి రాష్ట్రంలో ఎక్కడా అనుమతించలేదని కోర్టుకు తెలిపింది. అక్రమంగా రవాణా చేస్తున్న ఒంటెలను సీజ్‌ చేసి రాజస్థాన్‌కు తిప్పి పంపామని, బాధ్యులపై కేసులు నమోదు చేసినట్లు తెలిపింది.

Updated Date - 2020-07-18T08:22:19+05:30 IST