చిత్రపురి కాలనీలో ఇల్లు ఎలా వచ్చింది?

ABN , First Publish Date - 2020-12-10T08:31:33+05:30 IST

సినీ కార్మికులకు కేటాయించిన చిత్రపురికాలనీలో ఇల్లు ఎలా వచ్చిందో ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ చెప్పాలని మాజీ మంత్రి, బీజేపీ నేత బాబూమోహన్‌ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన

చిత్రపురి కాలనీలో ఇల్లు ఎలా వచ్చింది?

ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌కు బాబూమోహన్‌ సూటిప్రశ్న


హైదరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): సినీ కార్మికులకు కేటాయించిన చిత్రపురికాలనీలో ఇల్లు ఎలా వచ్చిందో ఆందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ చెప్పాలని మాజీ మంత్రి, బీజేపీ నేత బాబూమోహన్‌ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర  కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. సినీ పరిశ్రమకు, మీకు ఏంటి సంబంధం అని అడిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యల క్లిప్పింగ్స్‌నే తమ పార్టీ కార్యకర్తలు ప్రదర్శిస్తే, దానిపై క్రాంతికిరణ్‌ విమర్శలు చేయడం విస్మయం కలిగిస్తోందన్నారు. ఆయనకు ఎన్ని డిగ్రీలు ఉన్నాయో తనకు తెలియదు కానీ సంస్కారహీనంగా మాట్లాడారని విమర్శించారు. డబ్బులు తీసుకోకుండా కార్యకర్తలకు పదవులు ఇప్పించినట్లు ప్రమాణం చేస్తారా? అని నిలదీశారు. పుల్కల్‌ మండలంలో కొన్న భూములపై, చెరువు శిఖం కబ్జాలపై, డబుల్‌బెడ్‌రూం ఇళ్లలో అవినీతిపై చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. పటాన్‌చెరు ఎమ్మెల్యే మహీపాల్‌రెడ్డి ఒక మనిషిలా మాట్లాడటంలేదని  విమర్శించారు. 

Updated Date - 2020-12-10T08:31:33+05:30 IST