మజ్లిస్‌ శక్తి ఎంత?

ABN , First Publish Date - 2020-11-26T08:24:43+05:30 IST

బీజేపీ నేతల్లాగే ఎంఐఎం నాయకులూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారని, వారి శక్తి ఎంత అని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ ప్రశ్నించారు.

మజ్లిస్‌ శక్తి ఎంత?

వాళ్లు ప్రభుత్వాన్ని కూలగొడతారా? 

కాంగ్రె్‌సను చూస్తే జాలేస్తోంది: తలసాని

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): బీజేపీ నేతల్లాగే ఎంఐఎం నాయకులూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని పడగొడతామంటున్నారని, వారి శక్తి ఎంత అని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ ప్రశ్నించారు. ఎవరు పడితే వాళ్లు మాట్లేడేందుకు తాము అంత అలకగా దొరికామా అన్నారు. ఎంఐఎం నేతలు దేశమంతా తిరిగి పోటీ చేస్తూ ఎవరికి లాభం చేస్తున్నారో తెలియదా అని అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తరచుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పనితీరును మెచ్చుకునే కేంద్ర మంత్రులు.. ఎన్నికలు రాగానే విమర్శలు చేస్తున్నారన్నారు.


హైదరాబాద్‌లో అసాంఘిక శక్తులు చెలరేగుతున్నట్లయితే కేంద్రం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. బీజేపీ నేతలు మదం పట్టి కేసీఆర్‌ కుటుంబంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో అసాధ్యమైన హామీలిచ్చారని, రూ. 50 వేల చొప్పున వరద సాయం ఇస్తామంటున్నారని, ఆ పార్టీని చూస్తే జాలేస్తోందని ఆయన అన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌ మాట్లాడుతూ.. టీఆర్‌ఎ్‌సను దేశద్రోహుల పార్టీ అని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ అంటున్నారని, తన తండ్రి డి. శ్రీనివాస్‌ టీఆర్‌ఎస్‌ నుంచే రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలియదా అని ప్రశ్నించారు.  


Updated Date - 2020-11-26T08:24:43+05:30 IST