విధులెలా కేటాయిస్తారు
ABN , First Publish Date - 2020-11-25T07:54:36+05:30 IST
ఉపాధ్యాయులకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విధులు కేటాయించొద్దని ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్పష్టం చేయగా తమను ఎలా పిలుస్తారని ఇంగ్లీష్,

ఇఫ్లూ అధ్యాపకులు
హైదరాబాద్, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయులకు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విధులు కేటాయించొద్దని ఎన్నికల కమిషన్ ఇప్పటికే స్పష్టం చేయగా తమను ఎలా పిలుస్తారని ఇంగ్లీష్, ఫారన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (ఇఫ్లూ) అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రిసైడింగ్ అధికారులుగా విధులు నిర్వర్తించాలంటూ ఎన్నికల కమిషన్, జీహెచ్‌ఎంసీ అధికారుల నుంచి తమకు సమాచారం అందిందని అధ్యాపకులు మంగళవారం ఇఫ్లూ రిజిస్ర్టార్‌కు రాసిన లేఖలో తెలిపారు.
ఇఫ్లూ విద్యార్థులకు ఇటీవలే ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమైనందున ఎన్నికల విధులను నిర్వర్తించలేమని స్పష్టం చేశారు.