పదవ తరగతి విద్యార్థుల కోసం తెరుచుకున్న వసతిగృహాలు

ABN , First Publish Date - 2020-06-04T16:30:58+05:30 IST

లాక్‌డౌన్ నేపధ్యంలో మూతబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు గురువారం తెరుచుకున్నాయి. వాయిదాపడిన టెన్త్‌ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో విద్యార్థుల సౌకర్యార్థం వసతిగృహాలను తెరువాలని అధికారులు నిర్ణయించారు.

పదవ తరగతి విద్యార్థుల కోసం తెరుచుకున్న  వసతిగృహాలు

హైదరాబాద్ : లాక్‌డౌన్ నేపధ్యంలో మూతబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లు గురువారం తెరుచుకున్నాయి. వాయిదాపడిన టెన్త్‌ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో విద్యార్థుల సౌకర్యార్థం వసతిగృహాలను తెరువాలని అధికారులు నిర్ణయించారు.


ఈ నెల 8 నుంచి టెన్త్‌ పరీక్షలు రాయనున్న 18 వేల మందికి పైగా విద్యార్థులు గురువారం నుంచి హాస్టళ్లకు వచ్చేందుకు అనుమతివ్వడంతో వాటిలో కల్పించాల్సిన ప్రత్యేక సౌకర్యాలు, కరోనా వైరస్‌ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. 


వసతి గృహాలను శుభ్రపర్చడంతోపాటు, క్రిమిసంహారక ద్రావణాన్ని పిచికారీ చేసి సిద్ధంగా ఉంచారు. పిల్లలను ఇంటినుంచే పరీక్షా కేంద్రానికి పంపాల నుకుంటే ... హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌కు ముందుగా సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. 


ప్రభుత్వ మార్గదర్శకాలు... 

1) విద్యార్థులు మాస్క్‌లు ధరించడం, వ్యక్తిగత శుభ్రత, భౌతికదూరం పాటించడంపై ప్రత్యేక దృష్టి సారించాలి.

2) గదికి ఐదుగురినే ఉంచాలి.

3) విద్యార్థుల్లో రోగ నిరోధకశక్తి పెంచేలా పండ్ల రసాలు, పండ్లు, స్నాక్స్‌ను రోజువారీ ఆహారంతోపాటు అందించాలి. 

       4) వ్యక్తిగతంగా ప్యాడ్‌, ఇతర స్టేషనరీ వస్తువులు ఇవ్వాలి.

       5 విద్యార్థులను బృందాలుగా ఏర్పాటు చేసి ప్రత్యేక గదుల్లో భోజనానికి ఏర్పాట్లుచేయాలి.

     6) విద్యార్థులను ప్రైవేటువాహనాల్లో పరీక్షాకేంద్రాలకు తరలించాలి.

Updated Date - 2020-06-04T16:30:58+05:30 IST