ఇక ఆస్పత్రుల రిజిస్ట్రేషన్, రెన్యువల్స్ ఆన్‌లైన్‌లోనే
ABN , First Publish Date - 2020-10-21T08:35:22+05:30 IST
రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరిగేలా ఆరోగ్యశాఖ కొత్త వెబ్‌సైట్‌ను రూపొందించింది.

ప్రత్యేక వెబ్‌సైట్ ఏర్పాటు.. జీవో జారీ
హైదరాబాద్, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రైవేటు ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్ మొత్తం ఆన్‌లైన్‌లోనే జరిగేలా ఆరోగ్యశాఖ కొత్త వెబ్‌సైట్‌ను రూపొందించింది. ఇక నుంచి ఎవరైనా ఆస్పత్రి పెట్టాలన్నా, పాత దవాఖానలు రెన్యువల్ చేయించుకోవాలన్నా ్ట్చఝఛ్చి.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సర్కారు జీవో జారీ చేసింది. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించింది. ఆ వెబ్‌సైట్ ద్వారా ఆస్పత్రుల రెన్యువల్, రిజిస్ట్రేషన్ దరఖాస్తులు పంపడం.. వాటికి సంబంధించిన అనుమతులు, తిరస్కరణలు, తిరస్కరణకు గురైన వాటిపై అప్పీలు, రిజిస్ట్రేషన్ సస్పెన్షన్, రద్దు, సర్కారుకు ఫీజుల చెల్లింపునకు పేమెంట్ గేట్‌వే లాంటి సేవలన్నీ అందుతాయని జీవోలో పేర్కొన్నారు. అలాగే ప్రీ కాన్సెప్షన్ ప్రీ నాటల్ డయాగ్నస్టిక్స్ టెక్నిక్స్ (పీసీపీఎన్‌డీటీ) చట్టం మేరకు రాష్ట్రంలోని అన్ని జెనెటిక్స్ కౌన్సెలింగ్ కేంద్రాలు, జెనెటిక్ లేబొరేటరీస్, జెనెటిక్ క్లినిక్స్, అలా్ట్రసౌండ్, స్కానింగ్ చేసే క్లినిక్స్, ల్యాబులు కూడా ఇక నుంచి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్‌కు సంబంధించిన సర్టిఫికెట్స్‌ను ఞఛిఞుఽ్టఛీ.్ట్ఛజ్చూుఽజ్చుఽ్చ.జౌఠి.జీుఽ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలని మరో జీవోలో పేర్కొంది. దరఖాస్తు చేసిన 70 రోజుల్లో ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అందులో ఆదేశించింది.