సూపర్‌స్పెషాలిటీ తరహాలో సర్కారు వైద్యం

ABN , First Publish Date - 2020-12-18T04:33:46+05:30 IST

సూపర్‌స్పెషాలిటీ తరహాలో సర్కారు వైద్యం

సూపర్‌స్పెషాలిటీ తరహాలో సర్కారు వైద్యం

 మహబూబాబాద్‌ టౌన్‌, డిసెంబరు 17: ప్రభుత్వ దవాఖానాల్లో సూపర్‌స్పెషాలిటీ తరహాలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని  జిల్లా ఆస్పత్రి కో ఆర్డినేటర్‌ భీమ్‌ సాగర్‌, జిల్లా వైద్యాధికారి డి. శ్రీరాం అన్నారు.  మహబూబాబాద్‌ జిల్లా ఆస్పత్రిలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఎక్కడా లేని విధంగా జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక నవజాత శిశు కేంద్రం (ఎస్‌ఎన్‌సీయూ), ఐసీయూ, డయాలసిస్‌ కేంద్రాల్లో సేవలు అందుతున్నాయని ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశా రు. సిటీస్కాన్‌, తెలంగాణ డయాగ్నసిస్‌ హబ్‌ కూడ మంజూరైందన్నారు.  ప్రస్తుతం రూ. 67 లక్షలతో 40  పడకల ఆస్పత్రితో పాటు రూ.10 లక్షలతో కోవిడ్‌-19 ఐసోలేషన్‌ వార్డు, గూడూరులో రూ.10 లక్షలతో  50 పడకల  కొవిడ్‌ ఐసోలేషన్‌ను నిర్మిస్తున్నట్లు వివరించారు. కలెక్టర్‌ వీపీ. గౌతమ్‌ సూచనలు, భరోసాతో ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచామని పేర్కొన్నారు. రూ.1.40 కోట్లతో బ్లడ్‌బ్యాంక్‌ ప్రారంభిం చడం జరిగిందన్నారు. జిల్లాలో 1.76 లక్షల కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలుచేయగా అందులో కేవలం 10,058 మందికి మాత్రమే పాజిటివ్‌ వచ్చిందని 24 శాతం ఉన్న కొవిడ్‌ తగ్గుముఖం పట్టి 5 శాతానికి వచ్చిందని తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో అన్ని విభాగాల డాక్టర్లున్నారని  వారి వైద్య సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు.    సమా వేశంలో ఆర్‌ఎంవో చింతారమేష్‌, ఎస్‌ఎన్‌సీయూ నోడల్‌ ఆఫీసర్‌ జగదీశ్వర్‌, గైనాకాల జిస్ట్‌ వీరన్ననాయక్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-18T04:33:46+05:30 IST