ఇంటి వద్దనే సేంద్రియ ఎరువు తయారీ
ABN , First Publish Date - 2020-08-16T10:17:45+05:30 IST
ఇంట్లోనూ, పెద్ద మొత్తంలో వ్యర్థాలు ఉన్న చోటనే సేంద్రియ ఎరువుల తయారీని చేపట్టాలని ..

- మునిసిపల్ శాఖ కార్యాచరణ
హైదరాబాద్, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): ఇంట్లోనూ, పెద్ద మొత్తంలో వ్యర్థాలు ఉన్న చోటనే సేంద్రియ ఎరువుల తయారీని చేపట్టాలని మునిసిపల్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో దీనిని చేపట్టేందుకు మార్గదర్శకాలను రూపొందించింది. మహిళా స్వయం సహాయక సం ఘాలు(ఎ్‌సహెచ్‌జీ), ప్రజల భాగస్వామ్యంతో దీనిని అమలు చేసేందుకు త్వరలో అడ్మినిస్ర్టేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(అస్కి) ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వ్యక్తిగత గృహాలతో పాటు సామూహికంగానూ ఎరువుల తయారీ చేయవచ్చని, తద్వారా వ్యర్థాల నిర్వహణ మ రింత సులభతరం కావడంతో పాటు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తయారీ పద్ధతులు: కుండ కంపోస్టింగ్, వెర్మీ కంపోస్టింగ్, డ్రమ్ము/డబ్బా కంపోస్టింగ్, బొకాఫీ కంపోస్టింగ్, గొయ్యి/గుంత కంపోస్టింగ్, వంట గది డబ్బా కంపోస్టింగ్ పద్ధతుల ద్వారా సేంద్రియ ఎరువులు తయారు చేయవచ్చు. ఈ పద్ధతులలో వ్యక్తిగత గృహాలు, చిన్న చిన్న సంఘాలు, అపార్ట్‌మెంట్లలో సమష్టిగానూ సేంద్రియ ఎరువును తయారు చేయవచ్చు. 10 నుంచి 300 గృహాల వరకు మధ్య తరహా సామూహిక గృహ సముదాయాలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్‌లు కూడా ఎరువును తయారు చేయడానికి అవకాశం ఉంటుంది.
బ్రౌన్స్/కార్బన్ ధాతువులు: తురిమిన కార్డు బోర్డు, పిండి చేసిన గుడ్డు పెంకులు, కాగితపు తువాళ్లు, తురిమిన వార్తాపత్రిక, పొడి ఆకులు, కొమ్మలు, తురిమిన గింజ గుండ్లు, రంపపు పొడి/కలప చిప్‌లు.
గ్రీన్స్/నైట్రోజన్ ధాతువులు: ఆకుపచ్చ ఆకులు, పండ్లు, పాత పువ్వులు, టీ బ్యాగులు, కూరగాయలు (వండినవి, వండనివి), రొట్టెలు, ధాన్యాలు, జుట్టు/ బొచ్చు, కాఫీ పొడి గింజలు. వీటితో సేంద్రియ ఎరువులు తయారు చేయవచ్చు.