‘క్వారంటైన్‌’ ముద్ర పడుతోంది

ABN , First Publish Date - 2020-03-23T09:39:42+05:30 IST

విదేశాల నుంచి వచ్చిన వారు ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా, ఒకవేళ వెళ్లినా ఇతరులు గుర్తించేలా అధికారులు హోం క్వారంటైన్‌ ముద్ర వేస్తున్నారు. నగరానికి వచ్చిన రోజు నుంచి 14వ రోజు వరకు

‘క్వారంటైన్‌’ ముద్ర పడుతోంది

హైదరాబాద్‌ సిటీ/మన్సూరాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి) : విదేశాల నుంచి వచ్చిన వారు ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా, ఒకవేళ వెళ్లినా ఇతరులు గుర్తించేలా అధికారులు హోం క్వారంటైన్‌ ముద్ర వేస్తున్నారు. నగరానికి వచ్చిన రోజు నుంచి 14వ రోజు వరకు ఇంట్లోనే ఉండాలని ముద్రలో స్పష్టంగా పేర్కొంటున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం వారి ఇళ్లకు వెళ్తున్న అధికారులు వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఆదివారం పలు ప్రాంతాల్లో అధికారులు.. 12 మందికి హోం క్వారంటైన్‌ ముద్రలు వేశారు. మార్చి 1, ఆ తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారి జాబితాను వైద్యారోగ్య శాఖ.. జీహెచ్‌ఎంసీలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌కు పంపిస్తోంది.


ఆ వివరాల ఆధారంగా సంబంధిత అధికారులకు సమాచారం ఇస్తున్నారు.  హోం క్వారంటైన్‌ ముద్ర ఉన్నవారు బయట తిరుగుతున్నట్లు కనబడితే సమాచారమివ్వాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా విదేశాల నుంచి వచ్చిన వారు హయత్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో 144 మంది ఉన్నట్లు గుర్తించారు. బృందాలుగా విడిపోయిన ఆయా విభాగాల అధికారులు.. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను సేకరించారు. 

Updated Date - 2020-03-23T09:39:42+05:30 IST