హరితహారంలో హోంమంత్రి మహమూద్ అలీ

ABN , First Publish Date - 2020-06-25T17:50:12+05:30 IST

హరితహారంలో హోంమంత్రి మహమూద్ అలీ

హరితహారంలో హోంమంత్రి మహమూద్ అలీ

హైదరాబాద్: ఆరవ విడత హరితహారంలో భాగంగా గోశామహల్ పోలీస్ గ్రౌండ్‌లో హోంమంత్రి మహమూద్ అలీ మొక్కలు నాటారు. హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం‌లో హోంమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హరితహారాన్ని ప్రారంభించారని... దేశంలోనే హరితహారంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత హరిత తెలంగాణగా మార్చిన ఘనత  ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని కొనియాడారు. ప్రతి గ్రామం, ప్రతి, నగరాలలో హరితహారం చక్కగా కొనసాగుతుందని హోంమంత్రి తెలిపారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ 30కోట్ల మొక్కలు నాటడం అని...ఆ దిశగా కృషి చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ వచ్చాక మొక్కలు నాటడంలో ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరు ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని హోంమంత్రి పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడలేని విధంగా ప్రతీ గ్రామం, ప్రతి నగరాలలో అందుబాటులో నర్సరీలు ఏర్పాటు చేశారన్నారు. గోశామహల్‌లో పోలీసులు ఇలాంటి గ్రీనరి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు కరోనాను జయించాలని ఆయన తెలిపారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు ప్రభుత్వానికి సహకరించి...ప్రభుత్వ సూచనలను పాటించాలని కోరారు. కరోనాను జయించడానికి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. కరోనా విజృంభిస్తున్న ఈసమయంలో పోలీసులు ఎంతో చాకచక్యంగా పనిచేశారని హోమంత్రి మహమూద్ అలీ అభినందించారు.

Updated Date - 2020-06-25T17:50:12+05:30 IST