పోలీస్‌శాఖలో త్వరలోనే మరిన్ని పోస్టుల భర్తీ

ABN , First Publish Date - 2020-10-24T08:12:14+05:30 IST

రాష్ట్రంలో త్వరలోనే మరోసారి పెద్ద ఎత్తున పోలీసు నియామకాలు చేపట్టనున్నట్లు హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. రాజబహదూర్‌

పోలీస్‌శాఖలో త్వరలోనే  మరిన్ని పోస్టుల భర్తీ

ప్రజల సమస్యలను ఓర్పుతో పరిష్కరించాలి

ఎస్సైల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో హోంమంత్రి

నేర రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలి: డీజీపీ


హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో త్వరలోనే మరోసారి పెద్ద ఎత్తున పోలీసు నియామకాలు చేపట్టనున్నట్లు హోంమంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. రాజబహదూర్‌ వెంకటరామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో శుక్రవారం 12వ బ్యాచ్‌కు చెందిన 1162 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్ల పాసింగ్‌అవుట్‌ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు. సమాజంలోని పరిస్థితులను అర్థం చేసుకొని  ప్రజల సమస్యలను ఓర్పుతో పరిష్కరించాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో హైదరాబాద్‌ ముందంజలో ఉందని, త్వరలో ప్రారంభం కానున్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో నేరాల్ని మరింత సమర్థంగా నియంత్రించేందుకు వీలుంటుందన్నారు. నిజాయితీ, నిబద్ధతతో పని చేసి పోలీస్‌ శాఖకు, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఎస్సైలకు డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు.


సీఎం కేసీఆర్‌ విజన్‌ మేరకు నేర రహిత సమాజ స్థాపనకు కృషి చేయాలన్నారు. సాంకేతికత అందిపుచ్చుకుని.. స్మార్ట్‌ పోలీసింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. టీఎ్‌సపీఏ ఆసియాలోనే అత్యుత్తమ శిక్షణ కేంద్రంగా గుర్తింపు పొందిందని, సెంటర్‌ ఫర్‌ ఎక్సలెన్స్‌ హోదాను కూడా సొంతం చేసుకుందని అకాడమీ ఇన్‌చార్జి డైరెక్టర్‌ శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. శిక్షణలో ఉత్తమ ప్రదర్శన కనపర్చిన ఎస్సైలకు హోంమంత్రి, డీజీపీ పురస్కారాలు అందజేశారు.

Updated Date - 2020-10-24T08:12:14+05:30 IST