డిసెంబరు 1న కోర్టులకు సెలవు

ABN , First Publish Date - 2020-11-26T21:52:55+05:30 IST

జీహెచ్‌ఎంసి ఎన్నికల సందర్భంగా డిసెంబరు 1న జరిగే పోలింగ్‌రోజున తెలంగాణ హైకోర్టు సెలవు ప్రకటించిం

డిసెంబరు 1న కోర్టులకు సెలవు

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసి ఎన్నికల సందర్భంగా డిసెంబరు 1న జరిగే పోలింగ్‌రోజున తెలంగాణ హైకోర్టు సెలవు ప్రకటించింది. ప్రతి ఒక్కరూ విలువైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది. ఈసందర్భంగా పోలింగ్‌రోజున హైకోర్టు, సికింద్రాబాద్‌లోని తెలంగాణ జ్యూడియషియరీ అకాడమీ, తెలంగాణ స్టేట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, హైకోర్టు మీడియేషన్‌ అండ్‌ అర్బిట్రేషన్‌సెంటర్‌, హైకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ, హైదరాబాద్‌లోని అన్ని ట్రిబ్యునల్స్‌కు సెలవు ప్రకటించినట్టు హైకోర్టు రిజిస్ర్టార్‌జనరల్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2020-11-26T21:52:55+05:30 IST