తండ్రిపై తనయుడి దాడి
ABN , First Publish Date - 2020-04-28T09:57:05+05:30 IST
మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామానికి చెందిన ఓ కొడుకు డబ్బు కోసం సోమవారం ఉదయం తండ్రిపై దాడి చేశాడు.

ప్రభుత్వం ఇచ్చిన రూ.1500 ఇవ్వాలని గొడవ
నస్పూర్, ఏప్రిల్ 27: మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామానికి చెందిన ఓ కొడుకు డబ్బు కోసం సోమవారం ఉదయం తండ్రిపై దాడి చేశాడు. ప్రభుత్వం ఇచ్చిన రూ.1500లు బ్యాంకు నుంచి డ్రా చేసి ఇవ్వాలని తండ్రి చిక్కాల శ్రీనివా్‌స(45)తో కొడుకు సంతోష్ గొడవకు దిగాడు. దానికి ఒప్పుకోకపోవడంతో.. కోపంతో రెచ్చిపోయిన సంతోష్, కర్రతో తండ్రిపై దాడి చేశాడు. ఆయన తలకు తీవ్ర గాయమైంది. అతడిని చికిత్స నిమిత్తం కరీంనగర్‌కు తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రమోద్ రెడ్డి తెలిపారు.