పండుగలకు ఆంక్షలు విధిస్తే హిందూ సమాజం ఊరుకోదు: బండి సంజయ్‌

ABN , First Publish Date - 2020-08-20T22:40:40+05:30 IST

పండుగలకు ఆంక్షలు విధిస్తే హిందూ సమాజం ఊరుకోదని ఎంపీ బండి సంజయ్‌ హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు.

పండుగలకు ఆంక్షలు విధిస్తే హిందూ సమాజం ఊరుకోదు: బండి సంజయ్‌

హైదరాబాద్: పండుగలకు ఆంక్షలు విధిస్తే హిందూ సమాజం ఊరుకోదని ఎంపీ బండి సంజయ్‌ హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎంఐఎం చేతిలో కీలుబొమ్మగా మారిందని ఆరోపించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం దిగిరావాలి.. లేకుంటే హిందువులంతా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోలేని పరిస్థితులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సృష్టిస్తోందని ఆయన తప్పుబట్టారు. రంజాన్ పండుగకు బిర్యానీ, కాజు, పిస్తాలు పంచిన ప్రభుత్వం.. గణేష్ ఉత్సవాలపై ఆంక్షలు విధించడం సిగ్గుచేటని బండి సంజయ్‌ మండిపడ్డారు.

Updated Date - 2020-08-20T22:40:40+05:30 IST