ఉన్నతాధికారుల మెడకు.. ఏకే-47 కేసు
ABN , First Publish Date - 2020-02-08T05:30:00+05:30 IST
సదానందం తన భార్యతో ఉన్న వివాదం నేపథ్యంలో మూడేళ్ల క్రితం తరచూ హుస్నాబాద్ పోలీ్‌సస్టేషన్‌కు వచ్చేవాడు. అప్పట్లో మాయమైన తుపాకులు తాజాగా సదానందం వద్దే లభ్యమైనా.. అతడు అంత సులభంగా ఏకే-47 తుపాకీ, దానిని

- హుస్నాబాద్ పీఎస్‌లో 2017లో ఏకే-47, కార్బైన్ మాయం
- సిద్దిపేట కాల్పుల ఉదంతంతో పోయిన తుపాకుల స్వాధీనం
- సదానందం చేతికెలా వెళ్లాయి?.. నాటి సీఐ భూమయ్యను ఇరికించేందుకేనా?
- తుపాకులు పోయినా.. ఉన్నట్లు రికార్డులు!.. మూడేళ్ల క్రితం గన్‌మన్‌పై కేసు
సదానందం తన భార్యతో ఉన్న వివాదం నేపథ్యంలో మూడేళ్ల క్రితం తరచూ హుస్నాబాద్ పోలీ్‌సస్టేషన్‌కు వచ్చేవాడు. అప్పట్లో మాయమైన తుపాకులు తాజాగా సదానందం వద్దే లభ్యమైనా.. అతడు అంత సులభంగా ఏకే-47 తుపాకీ, దానిని భద్రపర్చే బెల్టు, కార్బైన్ తుపాకీని ఎలా చోరీ చేయగలడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీ్‌సస్టేషన్‌లో ఇంటి దొంగల సహకారం లేనిదే.. ఆయుధాగారం (బెల్ ఆఫ్ ఆర్మ్‌స్)లోంచి అతడు తుపాకులను తీసుకెళ్లే అవకాశమే లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో గురువారం అర్ధరాత్రి జరిగిన కాల్పుల ఉదంతం ఇప్పుడు మలుపులు తిరుగుతోంది. సదానందం ఉపయోగించిన ఏకే-47 తుపాకీ.. మూడేళ్ల క్రితం హుస్నాబాద్‌లో మాయమైందేనని పోలీసులు తేల్చారు. ఇప్పుడు ఈ కేసు ఉన్నతాధికారుల మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. పోలీసుల మధ్య విభేదాలే.. తుపాకులు మాయమవ్వడానికి కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అప్పట్లో సీఐ భూమయ్య చెప్పిన మాటలు ఇప్పుడు అక్షరసత్యాలని నిరూపితమవుతున్నాయి.
జరిగింది ఇదీ..
2017 జనవరిలో హుస్నాబాద్ పోలీ్‌సస్టేషన్‌లో ఏకే-47, కార్బైన్ తుపాకులు కనిపించకుండా పోయాయి. అదే సమయంలో.. అప్పటి సీఐ దాసరి భూమయ్య తనను ఉన్నతాధికారులు వేధింపులకు గురిచేస్తున్నారంటూ.. అప్పటి సిద్దిపేట పోలీసు కమిషనర్ శివకుమార్‌పై ఆరోపణలు చేశారు. ఏ కారణం లేకుండా తనను బదిలీ చేశారని, మానసిక ఒత్తిడికి గురిచేశారని బాహాటంగా చెప్పారు. ఆ తర్వాత ఆయనపై బదిలీ వేటు పడింది. భూమయ్య బదిలీ అయిన రెండు నెలల తర్వాత ఆయనకు ఉన్నతాధికారులు నోటీసులు ఇచ్చారు. హుస్నాబాద్ పీఎ్‌సలో ఏకే-47, కార్బైన్ కనిపించడం లేదని, వాటిని అప్పగించాలనేది అందులోని సారాంశం. దానికి బదులిస్తూ.. ఆ వివరాలు గన్‌మన్‌కు తెలుస్తాయని భూమయ్య వివరణ ఇచ్చారు. దీంతో.. అప్పటి గన్‌మన్ నరేందర్‌పై కేసు నమోదైంది. మూడేళ్లుగా ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. అయితే.. మూడేళ్ల క్రితం సదానందం తన భార్యతో ఉన్న వివాదం నేపథ్యంలో తరచూ హుస్నాబాద్ పోలీ్‌సస్టేషన్‌కు వచ్చేవాడు. అప్పట్లో మాయమైన తుపాకులు తాజాగా సదానందం వద్దే లభ్యమైనా.. అతడు అంత సులభంగా ఏకే-47 తుపాకీ, దానిని భద్రపర్చే బెల్టు, కార్బైన్ తుపాకీని ఎలా చోరీ చేయగలడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోలీ్‌సస్టేషన్‌లో ఇంటి దొంగల సహకారం లేనిదే.. ఆయుధాగారం (బెల్ ఆఫ్ ఆర్మ్‌్‌స)లోంచి అతడు తుపాకులను తీసుకెళ్లే అవకాశమే లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆయుధాలు ఉన్నట్లుగా రికార్డులు
మూడేళ్ల క్రితమే రెండు ఆయుధాలు మాయమైనా.. దీనిపై 2017 మార్చి 25న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైనా.. ఈ ఆరోపణలను అప్పట్లో ఉన్నతాధికారులు కొట్టిపారేస్తూ.. గోప్యత పాటించారు. అప్పటి నుంచి ఏకే-47, కార్బైన్ లేకున్నా.. రికార్డుల్లో, జనరల్ డైరీ (జీడీ)లో మాత్రం వాటిని ఉన్నట్లుగానే నమోదు చేస్తూ వచ్చారు. తప్పుడు రికార్డులు నమోదు చేస్తున్నందుకు ఇప్పుడు పోలీసులే నిందితులుగా మారే పరిస్థితి నెలకొంది.
ఆనాడు భూమయ్య ఏమన్నాడంటే..?
సీఐ భూమయ్య పదవీ విరమణ పొందిన తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘నన్ను వేధించేందుకే ఉన్నతాధికారులు ఈ కుట్ర పన్నారు. తుపాకులను మాయం చేసి, నాపై నింద మోపాలని ప్రయత్నిస్తున్నారు’’ అని పలు టీవీ చానళ్లతో ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి సిద్దిపేట సీపీపైనా ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఈ కేసు అప్పటి హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్ సిబ్బందితోపాటు.. ఉన్నతాధికారుల మెడకు చుట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
అక్కన్నపేటలో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్
ఏకే-47తో కాల్పులు జరిపి న దేవుని సదానందాన్ని అరె స్టు చేసిన పోలీసులు శనివారం అక్కన్నపేటలో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేశారు. అతడు తన ఇంట్లో తుపాకీని ఎక్కడ దాచాడు? ఎలా తీసుకొచ్చా డు? కాల్చిన తీరు.. ఎలా పారిపోయాడు? అనే వివరాలను నమోదు చేశారు. అనంతరం సదానందాన్ని రిమాండ్‌కు పోలీసు లు తరలించారు.