అమీన్‌పూర్ బాలిక లైంగిక దాడి కేసులో హైపవర్ కమిటీ విచారణ

ABN , First Publish Date - 2020-08-20T19:02:40+05:30 IST

హైదరాబాద్: అమీన్‌పూర్ బాలిక లైంగిక దాడి కేసులో హైపవర్ కమిటీ విచారణ నిర్వహిస్తోంది.

అమీన్‌పూర్ బాలిక లైంగిక దాడి కేసులో హైపవర్ కమిటీ విచారణ

హైదరాబాద్: అమీన్‌పూర్ బాలిక లైంగిక దాడి కేసులో హైపవర్ కమిటీ విచారణ నిర్వహిస్తోంది. బాలికపై లైంగిక దాడి కేసులో ఐదుగురు సభ్యుల కమిటి విచారణ నిర్వహిస్తోంది. ప్రాథమిక నివేదికను హైపవర్ కమిటీ సాయంత్రం అందజేయనుంది. ఇప్పటికే నిందితులను రెండు రోజులు పాటు జ్యూడిషియల్ కష్టడీలోకి తీసుకొని పోలీసులు విచారించారు. కస్టడీలో వెల్లడించిన అంశాలను పోలీసులు వీడియో తీశారు. బాలికపై లైంగిక దాడికి సంబంధించి విచారణలో వెల్లడించిన అంశాలను కమిటీకి పోలీసులు అందజేశారు. ఇప్పటికే కమిటీ చేతికి బాలిక పోస్ట్ మార్టం ప్రైమరి రిపోర్ట్ అందింది.


Updated Date - 2020-08-20T19:02:40+05:30 IST