పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఈసీకి హైకోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2020-11-06T23:36:40+05:30 IST

పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 1 నుండి 31 వరకు మళ్లీ నోటిఫికేషన్‌ ఇస్తామని ఈసీ

పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఈసీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: పట్టభద్రుల ఓటు నమోదు గడువు పెంచాలని ఈసీని హైకోర్టు ఆదేశించింది. డిసెంబర్ 1 నుండి 31 వరకు మళ్లీ నోటిఫికేషన్‌ ఇస్తామని ఈసీ, కోర్టుకు తెలిపింది. గతంలో ఫామ్-18, అప్లికేషన్ ద్వారా చేసుకున్న వారు.. ఇప్పుడు ఫామ్ 6, 7 ద్వారా దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పిస్తామని ఈసీ పేర్కొంది. గతంలో జారీ చేసిన ఓటు నమోదు నేటితోనే ముగుస్తుందని, అవసరమైతే డిసెంబరు 1 నుంచి 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ ప్రకటించింది. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు ఉంటే.. దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ హైకోర్టుకు ఈసీ తెలిపింది.


శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రతీ పట్టభద్రుడూ తమ ఓటుహక్కు కోసం దరఖాస్తు చేయాల్సిందే. ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలో పేర్లున్న వారితో పాటు 2017 ముందు వరకు డిగ్రీ పూర్తిచేసిన వారు కూడా ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాల్సిందే. నల్గొండ, వరంగల్‌, ఖమ్మం శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల నమోదు జాబితా షెడ్యూల్‌ను విడుదల చేసింది. గతంలో ఇక్కడి నుంచి గెలుపొందిన పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ పల్లారాజేశ్వరరెడ్డి పదవీకాలం మార్చినాటికి ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు జరగనున్నాయి. 

Updated Date - 2020-11-06T23:36:40+05:30 IST