రైల్వేశాఖపై హైకోర్టు అసహనం
ABN , First Publish Date - 2020-06-22T22:46:55+05:30 IST
వలసకూలీలను స్వస్థలాలకు తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బిహార్‌కు చెందిన 45 మంది వలసకూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారని న్యాయవాది

హైదరాబాద్: వలసకూలీలను స్వస్థలాలకు తరలింపుపై హైకోర్టులో విచారణ జరిగింది. బిహార్‌కు చెందిన 45 మంది వలసకూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్నారని న్యాయవాది వసుధ నాగరాజ్ కోర్టుకు తెలిపారు. బిహార్ వెళ్లే రైలుకు అదనపు బోగి ఎందుకు ఏర్పాటు చేయలేదని రైల్యే అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. అదనపు బోగి ఏర్పాటు చేయడానికి ఏ చట్టం అడ్డంగా మారిందని న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ప్యాసింజర్ రైలుకు 25 బోగీలు ఉండకూడదనేందుకు శాస్త్రీయ కారణాలున్నాయా అని కోర్టు ప్రశ్నించింది. పెళ్లిళ్ల కోసం ప్రత్యేక బోగీలు సమకూర్చే రైల్వే.. వలసకూలీలకు ఎందుకు చేయలేదని నిలదీసింది. దక్షిణ మద్య రైల్వే డివిజనల్ మేనేజర్ మంగళవారం విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.