మంథని నియోజకవర్గ పరిధిలో ఇసుక మాఫియాపై హైకోర్టు నోటీసులు

ABN , First Publish Date - 2020-06-22T20:54:30+05:30 IST

మంథని నియోజకవర్గ పరిధిలో ఇసుక మాఫియాపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వెంకటాపూర్ ఇసుక క్వారీ నిర్వహణపై ప్రతివాదులకు హైకోర్టు నోటీసులిచ్చింది. గత నెల 16న పెద్దపల్లి కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్‌పై

మంథని నియోజకవర్గ పరిధిలో ఇసుక మాఫియాపై హైకోర్టు నోటీసులు

హైదరాబాద్: మంథని నియోజకవర్గ పరిధిలో ఇసుక మాఫియాపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వెంకటాపూర్ ఇసుక క్వారీ నిర్వహణపై ప్రతివాదులకు హైకోర్టు నోటీసులిచ్చింది. గత నెల 16న పెద్దపల్లి కలెక్టర్ జారీ చేసిన ప్రొసీడింగ్‌పై కూడా ధర్మాసనం నోటీసులిచ్చింది. ఇసుక అక్రమాలపై న్యాయవాది వెంకటనాగమణి హైకోర్టుకు లేఖ రాశారు. మంథని నియోజకవర్గంలోని 14 ఇసుక క్వారీ మైనింగ్ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని హైకోర్టును న్యాయవాది కోరారు. నాలుగేళ్లుగా జరుగుతున్న ఇసుక రవాణాపై వివరాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను రెండు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2020-06-22T20:54:30+05:30 IST