బీసీ నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ABN , First Publish Date - 2020-05-17T08:29:20+05:30 IST

బీసీ సంక్షేమశాఖలో నిధుల దుర్వినియోగంపై దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో జూన్‌ 15లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని మరోసారి ఆదేశించింది.

బీసీ నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): బీసీ సంక్షేమశాఖలో నిధుల దుర్వినియోగంపై దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో జూన్‌ 15లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని మరోసారి ఆదేశించింది. ఈమేరకు ద్విసభ్య ధర్మాసనం ఇటీవల ఆదేశాలిచ్చింది. ఫూలే జయంతి ఉత్సవాలకోసం ప్రభుత్వం మంజూరుచేసిన రూ.14లక్షలు దుర్వినియోగపర్చారని ఆరోపిస్తూ శివుపల్లి రాజేశం అనే వ్యక్తి హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ ఏడాది జనవరిలోనే హైకోర్టు నోటీసులు ఇచ్చినా ఇంతవరకు కౌంటర్‌ వేయలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 

Updated Date - 2020-05-17T08:29:20+05:30 IST