ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు రోజువారి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశం

ABN , First Publish Date - 2020-10-03T22:36:54+05:30 IST

ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు రోజువారి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ జరపాలని కోర్టు పేర్కొంది.

ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు రోజువారి విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశం

హైదరాబాద్: ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు రోజువారి విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ జరపాలని కోర్టు పేర్కొంది. సీబీఐ, ఏసీబీ, ఎంపీలు, ఎమ్మెల్యేల కేసులు విచారిస్తున్న ప్రత్యేక కోర్టులకు హైకోర్టు ఆదేశించింది. నవంబరు 6 వరకు కోర్టులు అనుసరించాల్సిన అన్‌లాక్ విధానాన్ని హైకోర్టు  ప్రకటించింది. హైకోర్టులో విచారణలు ప్రస్తుత విధానంలోనే కొనసాగించాలని న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. జిల్లాల్లో కోర్టులు తెరిచి భౌతిక విచారణ కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2020-10-03T22:36:54+05:30 IST