లాక్‌డైన్‌ కాలంలో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని హైకోర్టులో పిల్స్

ABN , First Publish Date - 2020-06-22T23:52:16+05:30 IST

లాక్‌డైన్‌ కాలంలో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని హైకోర్టులో పిల్స్ దాఖలైంది. న్యాయవాది నరేష్, సమీర్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది.

లాక్‌డైన్‌ కాలంలో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని హైకోర్టులో పిల్స్

హైదరాబాద్: లాక్‌డైన్‌ కాలంలో విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని హైకోర్టులో పిల్స్ దాఖలైంది. న్యాయవాది నరేష్, సమీర్ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ చేపట్టింది. రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఎస్ పీడీ సీఎల్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చాయని హైకోర్టులో మరో పిల్ దాఖలైంది. శ్లాబులు సవరించి బిల్లులు తగ్గించాలనే వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ చేపట్టారు. విద్యుత్ బిల్లులపై ఫిర్యాదులు ఉంటే కమిటీని ఆశ్రయించాలని హైకోర్టు సూచించింది. ఫిర్యాదుల పరిష్కారానికి కమిటీ ఉండగా తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తెలిపింది. కమిటీకి 6,767 ఫిర్యాదులు రాగా.. 6,678 పరిష్కరించినట్టు ఏజీ ప్రసాద్ తెలిపారు.

Updated Date - 2020-06-22T23:52:16+05:30 IST