పోలీసుల తీరుపై హైకోర్టు అసంతృప్తి!
ABN , First Publish Date - 2020-05-13T09:52:11+05:30 IST
లాక్‌డౌన్‌లో పోలీసులు సామాన్య ప్రజల పట్ల వ్యవహరించిన తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను

హైదరాబాద్, మే 12(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌లో పోలీసులు సామాన్య ప్రజల పట్ల వ్యవహరించిన తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పనిచేసే పోలీసులకు వివరించి చెప్పలేదని వ్యాఖ్యానించింది. వనపర్తి జిల్లాలో బైక్‌పై వెళుతున్న తండ్రి, కొడుకులను ఆపి బాలుడి ముందే తండ్రిపై పోలీసులు చేయిచేసుకున్న ఉదంతాన్ని ఉటంకిస్తూ న్యాయవాది ఉమే్‌షచంద్ర హైకోర్టు సీజేకి రాసిన లేఖను సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది. ఈ వ్యాజ్యాన్ని జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ కె. లక్ష్మణ్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు పోలీసులకు తెలియకపోవడంతో వారు ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపింది.