దివ్యాంగులకు నిధిపై 24లోగా చెప్పండి!

ABN , First Publish Date - 2020-06-21T09:53:05+05:30 IST

దివ్యాంగులకు నిధిపై 24లోగా చెప్పండి!

దివ్యాంగులకు నిధిపై 24లోగా చెప్పండి!

  •  ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం


హైదరాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్‌ కోరిన విధంగా రూ.10 కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసే అంశంపై ఈనెల 24లోగా సానుకూలమైన కబురు చెప్పాలని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌కు హైకోర్టు స్పష్టం చేసింది. ఆయా జిల్లాల్లో నివసిస్తున్న దివ్యాంగుల సంఖ్యకు అనుగుణంగా జిల్లా సంక్షేమ ఆధికారులకు కేటాయించే నిధులు పెం చాలని సూచించింది. ఈమేరకు హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల ఆదేశాలిచ్చింది. లాక్‌డౌన్‌లో దివ్యాంగుల సమస్యలపై న్యాయవాది కె.శివగణేశ్‌ హైకోర్టులో వేసిన వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది.  దివ్యాంగుల ముఖ్య అవసరాలు తీర్చేందుకు రూ.10 కోట్లు కేటాయించాలని దివ్యాంగుల సంక్షేమశాఖ డైరెక్టర్‌ బి. శైలజ ప్రభుత్వాన్ని కోరారని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ కోర్టుకు తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు.  

Updated Date - 2020-06-21T09:53:05+05:30 IST