కాంట్రాక్టర్‌ను ఎందుకు తప్పించలేదు?
ABN , First Publish Date - 2020-08-20T09:41:18+05:30 IST
నీలోఫర్ ఆసుపత్రిలో రోగులకు ఆహారం సరఫరా చేసే డైట్ కాంట్రాక్టర్ సురేశ్ తప్పుచేసినట్లు నివేదిక వస్తే చర్యలు ఎందుకు

- 3 ఆస్పత్రుల్లో కొనసాగింపు వెనుక మతలబేంటి?
- ఏం చర్యలు తీసుకున్నారో నివేదిక ఇవ్వండి
- ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు
హైదరాబాద్, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): నీలోఫర్ ఆసుపత్రిలో రోగులకు ఆహారం సరఫరా చేసే డైట్ కాంట్రాక్టర్ సురేశ్ తప్పుచేసినట్లు నివేదిక వస్తే చర్యలు ఎందుకు తీసుకోలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధిక బిల్లులు వసూలు చేస్తున్నట్లు తేలినా... గాంధీ, చెస్ట్ ఆసుపత్రుల్లోనూ ఆయన్నే ఎందుకు కొనసాగిస్తున్నారని నిలదీసింది. నీలోఫర్‌లో అక్రమాలకు పాల్పడినట్లు నివేదికలో పేర్కొన్నందున నిబంధనల ప్రకారం ఆయనపై చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది. ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ కోర్టుకు నివేదిక ఇవ్వాలని సీజే రాఘవేంద్రసింగ్ చౌహాన్ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఈ వ్యవహారంపై డాక్టర్ పి. భగవంతరావు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించిన ధర్మాసనం... జూలై 30న హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎంతవరకు అమలు చేశారని ఆరాతీసింది. కాంట్రాక్టర్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏజీ బీఎస్ ప్రసాద్ ధర్మాసనానికి నివేదించారు.