ప్రైవేటు డ్రైవర్లకు సాయంపై పిల్‌లో జోక్యం చేసుకోం: హైకోర్టు

ABN , First Publish Date - 2020-07-22T08:49:02+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు క్యాబ్‌, ఆటో డ్రైవర్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ దాఖలైన

ప్రైవేటు డ్రైవర్లకు సాయంపై పిల్‌లో జోక్యం చేసుకోం: హైకోర్టు

హైదరాబాద్‌, జూలై 21 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రైవేటు క్యాబ్‌, ఆటో డ్రైవర్లకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంలో జోక్యం చేసుకోడానికి హైకోర్టు నిరాకరించింది. ఆర్థిక సహాయంపై ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని, ప్రభుత్వ విధుల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యంలో వాదనలు విన్న హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వాయిదా వేసింది. న్యాయవాది రాపోలు భాస్కర్‌ ఈ పిల్‌ దాఖలు చేయగా, న్యాయవాది రంగయ్య వాదించారు. ప్రైవేటు డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించి  ఆదుకునేలా ఆదేశాలివ్వాలని ఆయన కోరారు. ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఆర్థిక సహాయం చేయాల్సిందిగా తాము ప్రభుత్వాన్ని ఆదేశించలేమని స్పష్టం చేసింది.

Updated Date - 2020-07-22T08:49:02+05:30 IST