కరోనా పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
ABN , First Publish Date - 2020-06-18T22:01:32+05:30 IST
కరోనా పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశించింది. కీలక సమాచారం
హైదరాబాద్: కరోనా పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పరీక్షలు పెంచాలని ఆదేశించింది. కీలక సమాచారం మీడియా బులెటిన్‌లో ఉండాలని, జీహెచ్‌ఎంసీ పరిధిలో వార్డుల వారీగా కరోనా కేసులు వెల్లడించాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలపై గతంలో హైకోర్టు ప్రభుత్వాన్ని పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే.
ఇటీవల కరోనా పరీక్షలు ఎందుకు జరపడం లేదని ప్రభుత్వం తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. అనుమానితులకే కరోనా పరీక్షలు చేయాలని ఎందుకు నిర్ణయించారో తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, కేంద్రం మార్గదర్శకాల ప్రకారమే వ్యవహరిస్తున్నామని హైకోర్టుకు ఏజీ తెలిపారు. లక్షణాలు ఉన్న వారికే పరీక్ష చేయాలని డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల్లో ఎక్కడుందని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.