కరీంనగర్‌లో మరోసారి హై అలర్ట్
ABN , First Publish Date - 2020-03-23T17:37:08+05:30 IST
జిల్లా కలెక్టర్ శశాంక కరీంనగర్‌లో మరోసారి హై అలర్ట్ ప్రకటించారు.

కరీంనగర్: జిల్లా కలెక్టర్ శశాంక కరీంనగర్‌లో మరోసారి హై అలర్ట్ ప్రకటించారు. ఇండోనేషియన్లతో తిరిగిన స్థానికుడికి కరోనా పాజిటివ్ వచ్చిందని సోమవారం అధికారికంగా ప్రకటించారు. కరోనా సెకండ్ స్టేజ్ రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. కరీంనగర్‌లో మరింతగా కఠినంగా వ్యవహరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. సోమవారం సాయంత్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని శశాంక అన్నారు.
తొలి కరోనా పాజిటివ్ కేసు కరీంనగర్‌లో నమోదయింది. ఇండోనేషియా బృందంతో కలిసి తిరిగిన వ్యక్తికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఇండోనేషియా బృందం పర్యటించిన ప్రాంతాల్లో పోలీసులు, అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రజలెవరూ బయటకు రావొద్దని అధికారులు సూచించారు. కరోనా బాధితుడిని కలిసిన వ్యక్తులు ఆస్పత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కరోనా బాధితుడిని అధికారులు కరీంనగర్ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు.