ఆదిలాబాద్‌లో పాజిటివ్ కేసుల నేపథ్యంలో హై అలర్ట్

ABN , First Publish Date - 2020-04-07T14:31:21+05:30 IST

ఆదిలాబాద్: జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రభావిత ప్రాంతాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను అమలు చేశారు.

ఆదిలాబాద్‌లో పాజిటివ్ కేసుల నేపథ్యంలో హై అలర్ట్

ఆదిలాబాద్: జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రభావిత ప్రాంతాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ను అమలు చేశారు. జిల్లా కేంద్రంలో 19 ప్రభావిత వార్డులను అధికారులు గుర్తించారు. నేరేడుగొండ మండల కేంద్రం పాటు సమీపంలోని 2 గ్రామాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఉట్నూర్ మండలంలోని హాసనాపూర్ సహా 5 గ్రామాలను ప్రభావిత ప్రాంతాలుగా అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో వైద్య బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి.

Read more