ఆదిలాబాద్ జిల్లాలో హై అలర్ట్

ABN , First Publish Date - 2020-04-05T13:45:47+05:30 IST

కరోనా వైరస్ పాజిటివ్ సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు..

ఆదిలాబాద్ జిల్లాలో హై అలర్ట్

ఆదిలాబాద్ జిల్లా: కరోనా వైరస్ పాజిటివ్ సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అదిలాబాద్ జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే 10 మందికి కరోనా పాజిటివ్ రావడంతో వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరో 25 మందికి సంబంధించి వైద్య నివేదికలు ఆదివారం వెల్లడి కానున్నాయి. కాగా జిల్లా కేంద్రంలో ఆంక్షలు తీవ్రతరం చేశారు. మాంసం, కూరగాయల విక్రయాలు నిలిపివేశారు. అధికారులు ఇంటింటి సర్వే చేస్తున్నారు. బాధితులంతా మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వాళ్లేకావడంతో ఏజెన్సీలోనూ అధికారులు అప్రమత్తమయ్యారు.

Updated Date - 2020-04-05T13:45:47+05:30 IST