హెరిటేజ్‌ ఫుడ్స్‌ కోటి విరాళం

ABN , First Publish Date - 2020-03-30T10:37:43+05:30 IST

కరోనా వైరస్‌ వల్ల ప్రభావితమైన వారికి సహాయం అందించేందుకు హెరిటేజ్‌ ఫుడ్స్‌ కోటి రూపాయల విరాళం ప్రకటించింది. ఇందులో

హెరిటేజ్‌ ఫుడ్స్‌ కోటి విరాళం

కరోనా వైరస్‌ వల్ల ప్రభావితమైన వారికి సహాయం అందించేందుకు హెరిటేజ్‌ ఫుడ్స్‌ కోటి రూపాయల విరాళం ప్రకటించింది. ఇందులో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల సహాయనిధికి రూ. 30 లక్షల చొప్పున అందజేసింది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీలకు రూ. 10 లక్షల చొప్పున సహాయం అందిస్తున్నట్లు తెలిపింది. ‘‘మనం ఎప్పుడూ ఊహించని పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండండి. బాఽధ్యత గల ప్రతీ పౌరుడు సంయమనం, సామాజిక దూరం పాటించాలి. ఆ విధంగా కరోనాపై పోరుకు మీ వంతుకు సాయం చేయాలి’’ అని హెరిటేజ్‌ ఫుడ్స్‌ వైస్‌ చైర్మన్‌ నారా భువనేశ్వరి ఈ సందర్భంగా కోరారు.

Updated Date - 2020-03-30T10:37:43+05:30 IST