హేమంత్ హత్య కేసులో రెండో రోజుకు చేరుకున్న నిందితుల కస్టడి

ABN , First Publish Date - 2020-10-01T15:59:10+05:30 IST

హైదరాబాద్: హేమంత్ హత్య కేసులో నిందితుల కస్టడి రెండో రోజుకు చేరుకుంది.

హేమంత్ హత్య కేసులో రెండో రోజుకు చేరుకున్న నిందితుల కస్టడి

హైదరాబాద్: హేమంత్ హత్య కేసులో నిందితుల కస్టడి రెండో రోజుకు చేరుకుంది. నిన్న చర్లపల్లి జైలు నుంచి నిందితులను గచ్చిబౌలి పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించారు. ప్రాణం కంటే పరువే ముఖ్యమని హేమంత్‌ను హత్య చేశామని అవంతి తండ్రి లక్ష్మారెడ్డి తెలిపారు. హేయంత్ పెళ్లి చేసుకున్న తరువాత కాలనీలో తలెత్తుక్కని తిరిగలేకపోయామన్నారు. విచారణలో భాగంగా.. లక్ష్మారెడ్డి 15 ఏళ్లుగా మాటలు లేని యుగంధర్ రెడ్డితో అవంతి పెళ్లి వ్యవహారంపై మాట్లాడాల్సి వచ్చిందని తేలింది. అవంతి పేరు మీద ఉన్న ఆస్తులు మొత్తం రాసిచ్చినా ఎందుకు హత్య చేశారన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. మరోసారి నిందితులను క్రైమ్ జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్నారు.

Updated Date - 2020-10-01T15:59:10+05:30 IST