హేమంత్‌ హత్యకేసు..

ABN , First Publish Date - 2020-12-03T08:02:59+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అవంతిక భర్త హేమంత్‌కుమార్‌ పరువు హత్య కేసులో నిందితులకు బెయిలు మంజూరు చేయడానికి హైకోర్టు నిరాకరించింది.

హేమంత్‌ హత్యకేసు..

నిందితుల బెయిల్‌ పిటిషన్లు డిస్మిస్‌

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అవంతిక భర్త హేమంత్‌కుమార్‌ పరువు హత్య కేసులో నిందితులకు బెయిలు మంజూరు చేయడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో నిందితులు రంజిత్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, రజిత, కె.సంతో్‌షరెడ్డి, సందీ్‌పరెడ్డి, సత్య, స్వప్న, సాహెబ్‌పటేల్‌, గూడురు సందీ్‌పరెడ్డిలు బెయిలు కోసం దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ బుధవారం ఆదేశాలు జారీచేశారు.


పిటిషనర్ల తరపున న్యాయదులు వాదిస్తూ.. హేమంత్‌ కుమార్‌ హత్య కేసులో తమ క్లెయింట్లకు పాత్ర లేదన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడేందుకు పిలవమంటేనే వెళ్లారన్నారు. ఈ వాదనలను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రతా్‌పరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కేసులో నిందితులందరికీ సమాన పాత్ర ఉందని స్పష్టం చేశారు. ఆ మేరకు సమాచారం అందిపుచ్చుకున్నారన్నారు. హేమంత్‌ హత్య ఒక పథకం ప్రకారం జరిగిందన్నారు. ఇందులో కుట్రకోణం ఉందని వాదించారు. నిందిలందరికి ఒకే శిక్ష పడే అవకాశం ఉందన్నారు.

భారతదేశంలో కుల వ్యవస్థ నిర్మూలనకు ప్రయత్నాలు జరుగుతుంటే.. పరువు హత్యలు చేయడాన్ని క్షమించరాదని 2006లోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తుచేశారు. నిందితులకు బెయిలు మంజూరు చేయరాదన్నారు. పోలీసులు నిందితులకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాధారాలను సేకరించినట్లు తెలిపారు. పీపీ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. నిందితుల బెయిలు పిటిషన్లను కొట్టివేసింది.


Updated Date - 2020-12-03T08:02:59+05:30 IST