రిజిస్ట్రేషన్ల సమస్యలు పరిష్కరించేలా సాయం చేయండి

ABN , First Publish Date - 2020-12-19T07:00:37+05:30 IST

భూముల రిజిస్ట్రేషన్‌ విధానాల్లో జరిగిన మార్పులతో ఉత్పన్నమైన సమస్యలను త్వరగా పరిష్కరించేలా సాయం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను నగరంలోని బిల్డర్లు,

రిజిస్ట్రేషన్ల సమస్యలు పరిష్కరించేలా సాయం చేయండి

బండి సంజయ్‌కు బిల్డర్ల వినతి పత్రం 

హైదరాబాద్‌, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): భూముల రిజిస్ట్రేషన్‌ విధానాల్లో జరిగిన మార్పులతో ఉత్పన్నమైన సమస్యలను త్వరగా పరిష్కరించేలా సాయం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను నగరంలోని బిల్డర్లు, పౌర ప్రతినిధులు కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయనకు వినతి పత్రం ఇచ్చారు. ప్రభుత్వంతో చర్చించి ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.


ఓపెన్‌ ప్లాట్‌లకు వేకెంట్‌ టాక్స్‌ పిన్‌ అడుగుతున్నారని ఇది పేదలపై పెనుభారంగా మారిందన్నారు. స్లాట్‌ బుక్‌ చేసుకునేందుకు అనేక అవరోధాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. సర్వే నెంబర్‌లు ఎంట్రీ చేసినా రావడం లేదన్నారు. రిజిస్ట్రేషన్లలో మార్పుల వల్ల ఇటువంటి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.


Read more