అనాథలైన చిన్నారులను ఆదుకోండి

ABN , First Publish Date - 2020-05-17T08:19:21+05:30 IST

నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామానికి చెందిన తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ఏర్పుల అజయ్‌ (14), అంజలి(6)ని ఆదుకోవాలని....

అనాథలైన చిన్నారులను ఆదుకోండి

నల్లగొండ కలెక్టర్‌కు సూచించిన కేటీఆర్‌  


మర్రిగూడ, మే 16: నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామానికి చెందిన తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన ఏర్పుల అజయ్‌ (14), అంజలి(6)ని ఆదుకోవాలని కలెక్టర్‌ జీవన్‌పాటిల్‌కు మంత్రి కేటీఆర్‌ సూచించారు. చిన్నారుల దీనస్థితి గురించి కొట్టాల గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త, స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు అరుణ్‌సాగర్‌ శనివారం ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌కు వివరించారు. దీనికి స్పందించిన కేటీఆర్‌.. అనాథలైన చిన్నారుల వివరాలను తెలుసుకొని, వారిని జిల్లాలోని బాలరక్ష భవన్‌లో ఆశ్రయం కల్పించాలని, విద్యాభ్యాసం కోసం రెసిడెన్షియల్‌ పాఠశాలలో చేర్పించాలని కలెక్టర్‌కు సూచించారు. 

Updated Date - 2020-05-17T08:19:21+05:30 IST